Breaking News

సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని  ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.  ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ, బొండా రవితేజ కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రానున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై సానుకూలంగా చర్చించారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోందని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *