Breaking News

సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాల, డైట్ చార్జీల కోసం ₹137.98 కోట్లు విడుదల

-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వివిధ కేడర్ల సిబ్బంది, ఉపాధ్యాయుల జూన్, జూలై నెలల వేతనాలతో పాటు డైట్ చార్జీల చెల్లింపుల కోసం రూ. 137.98 కోట్లు నిధులను విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల ప్రక్రియ పూర్తవ్వడంతో, రెండు నెలల బకాయి వేతనాలు, సంబంధిత అలవెన్సుల మొత్తం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులను వెంటనే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సిబ్బందికి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *