అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ టెట్ జూన్ 2026 సంబంధించి పరీక్షలు 05.08.2026 నుండి నిర్వహించబడుతున్నవి. ఈరోజు అనగా 05.08.2026 ఉదయము మరియు మధ్యాహ్నము రెండు సెషన్ లలో కూడా పేపర్ 2a – లాంగ్వేజ్ (తెలుగు) పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఉదయము 57 పరీక్షా కేంద్రాలలో 8148 అభ్యర్థుల గాను 7453 మంది అభ్యర్థులు (91.4%), మధ్యాహ్నము 42 పరీక్షా కేంద్రాలలో 5801 అభ్యర్థుల గాను 5324 మంది అభ్యర్థులు (91.78%) పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈరోజు ఉదయం సెషన్ లో అనంతపురం జిల్లాలో 93.94%, మధ్యాహ్నం సెషన్ లో కడప జిల్లాలో 94.8% అత్యధికంగా హాజరు కావడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడినవి.
Tags amaravathi
Check Also
ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష
-రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …
Prajavartha Online Telugu News