Breaking News

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వినతి పత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ఈ రోజు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చలో సీసీఎల్ఏ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతి రాజు రవీంద్ర రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రలో పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యల పరిష్కారం అయ్యేవరకు రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మద్దతుగా ఉంటామని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు. ఇప్పటికే వీఆర్ఏల వారి సమస్యల గురించి ఎన్నోసార్లు రాష్ట్ర ఉన్నత అధికారులకు, రాష్ట్ర రెవిన్యూ మంత్రికు సమస్యలు విన్నవించుకున్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆందోళనతో ఈ రోజు కట్టిన నిర్ణయాలు తీసుకుని సెప్టెంబర్ 10వ తేదీ లోపు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 15వ తేదీ నుండి రెవిన్యూ విధులలో సహాయ నిరాకరణ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండల తా హ సిల్దార్ కార్యాలయల వద్ద నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ టి.ఎస్ చేతన్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర కమిటి లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం కూడా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలపై ఎన్నోసార్లు రాష్ట్ర ఉన్నత అధికారులకు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి కు దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పటివరకు వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలు పరిష్కారం చెయ్యకపోవడంతో ఈరోజు మంగళగిరి లో పెన్షనర్స్ అసోసియేషన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర సమావేశంలో వీఆర్ఏలకు మద్దతుగా మరియు వీఆర్వోలు సమస్యలపై సెప్టెంబర్ 10వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 15వ తేదీ నుండి రెవిన్యూ విధులను నిలుపుద చేసి సహాయ నిరాకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల తాహసిల్దార్ కార్యాలయల వద్ద వీఆర్ఏలు, వీఆర్వోలు, నిరవధిక రిలే దీక్షలు చేపట్టి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రెటరీ శివరామకృష్ణ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రామకృష్ణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజర్ల ప్రభాకర్ పశ్చిమగోదావరి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి. జకరయ్య, పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నాగేశ్వరరావు, హరినాథ్ మరియు విజయవాడ డివిజన్ అధ్యక్షుడు బాజీ, కాకినాడ డివిజన్ అధ్యక్షులు కిషోర్,ఏలూరు జిల్లా నాయకులు రవి, అజయ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *