గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ కి కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. గురువారం బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ని కమిషనర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందరూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నారని, అటువంటి వారి కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ ముందుకు వచ్చి సిఎస్ఆర్ లో భాగంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు వందల సంఖ్యలో వాకర్స్ వస్తారని, వారికి ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందన్నారు. స్టేడియంలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. స్టేడియంలో పారిశుధ్య పనులకు కార్మికులు అవసరమని సెక్రెటరీ తమ దృష్టికి తెచ్చారని, కార్మికులను కేటాయించాలని సిఎంఓహెచ్ ని ఆదేశించామన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, స్టేడియం సెక్రెటరీ వజ్జా రామకృష్ణ, కరూర్ వైశ్యా బ్యాంక్ డిజిఎం ఎన్.రమేష్, చీఫ్ మేనేజర్లు అరవింద్ గణేష్, వెంకట సత్యనారాయణ, స్టేడియం కమిటి నుండి ఉమామహేశ్వరరావు, కాంతారావు, వెంకట రత్తయ్య, యామిని శివజ్యోతి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News