గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పూర్తి కానున్నందున వెంటనే రోడ్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులను, పట్టాభిపురం మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్నిపరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు చివరి దశకు వచ్చినందున తక్షణం రోడ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. అలాగే కొన్ని పాయింట్స్ లో విద్యుత్ స్థంబాలు షిఫ్ట్ చేయడానికి సిపిడిసిఎల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. డ్రైన్ నిర్మాణం పెండింగ్ ఉన్న ప్రాంతాల్లో 2 రోజుల్లో పూర్తి చేయాలని ఈఈని ఆదేశించారు. కల్వర్ట్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షణ చేయాలని, ఎమినిటి కార్యదర్శులు, ఏఈ నాణ్యతపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అనంతరం పట్టాభిపురం మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి, బిల్డింగ్ మ్యాప్, సెట్ బ్యాక్, సెల్లార్లను ను తనిఖీ చేసి, నిర్మాణ వ్యర్ధాలను రోడ్ల మీద నుండి తొలగించాలన్నారు. అలాగే నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేదం అమలులో ఉన్నందున, ఎక్కడైనా గుర్తిస్తే స్వచ్చ యాప్ ద్వారా అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఈఈ విష్ణు, డిఈఈ వెంకటరమణ, ఏడీహెచ్ శాంతి, ఏసిపీ రెహ్మాన్, ఎస్ఎస్ సోమశేఖర్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News