గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ పరిధిలోని నల్లపాడు చెరువు మరియు యన్.టి.ఆర్ మానస సరోవరంలోని చెరువుల అభివృద్ధికి సంబంధించిన ప్రపోజల్స్ ను వారం లోగా సిద్దం చేసి ప్రభుత్వ అనుమతికి పంపాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఏపియుఐఎయంయల్ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులతో నల్లపాడు చెరువు మరియు యన్.టి.ఆర్ మానస సరోవరంలోని చెరువుల అభివృద్ధికి ప్రత్యేక సమావేశం జరిగింది.
సమావేశం నందు తొలుత నల్లపాడు చెరువు మరియు యన్.టి.ఆర్ మానస సరోవరంలను అభివృద్ధి చేయుటకు ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు తయారు చేసిన డి.పి.ఆర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలోని చెరువులను అభివృద్ధి చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటిలో ముందుగా నల్లపాడు చెరువు మరియు యన్.టి.ఆర్ మానస సరోవరంలోని చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని, చెరువుల అభివృద్దిలో వాకింగ్ ట్రాక్, గ్రీనరి ముఖ్యంగా చెరువు చుట్టూ రైలింగ్ వంటివి తప్పనిసరిగా ఉండాలని ఏపియుఐఎయంయల్ ప్రతినిధులను ఆదేశించారు. చెరువులను స్థానికంగా ఉండే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేలా అభివృద్ధి చేయాలని, వీటి అభివృద్దికి త్వరితగతిన ప్రతిపాదనలు సిద్దం చేసి, ప్రభుత్వ అనుమతికి పంపించాలని ఏపియుఐఎయంయల్ పతినిధులను జియంసి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, సెంట్రల్ డివైడర్లలో అవేన్యు ప్లాంటేషన్ అభివృద్దికి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు.
సమావేశంలో ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు ఆంజనేయులు, బేబి, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News