విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మారుతి నగర్‌లో నిర్వహించిన గంగానమ్మ బోనాల జాతర కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగానమ్మ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవినేని అవినాష్ ఆకాంక్షించారు.దేవినేని అవినాష్ మాట్లాడుతూ, మన ప్రాంతంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పండుగలు, జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. గంగానమ్మ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, మండల అధ్యక్షుడు ఎల్లబోయిన ప్రభు,డివిజన్ ప్రెసిడెంట్ లంకా అబ్బి నాయుడు,గంగానమ్మ కమిటీ సబ్యులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News