విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రముఖ పురుషుల వస్త్ర వ్యాపార సంస్థలు ‘మినిస్టర్ వైట్’ మరియు ‘ఒటో’ తమ నూతన షోరూమ్‌లను వైభవంగా ప్రారంభించాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దే రామ్ మోహనరావు ముఖ్య అతిథిగా హాజరై, షోరూమ్‌లను ప్రారంభించారు.
ఎమ్మెల్యే గద్దే రామ్ మోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దే రామ్ మోహనరావు మాట్లాడుతూ, విజయవాడలో వ్యాపార రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు, కరోనా వంటి సమస్యల వల్ల వ్యాపారాలు మందగించినప్పటికీ, 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వ్యాపార సంస్థలకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్నారు. ‘మినిస్టర్ వైట్’ సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 69 శాఖలను, ‘ఒటో’ సంస్థ 89 శాఖలను కలిగి ఉండి, సుమారు ₹1,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌తో రాణిస్తుండటం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రముఖ సంస్థలు విజయవాడకు రావడం వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి సూచికగా మారుతుందని వ్యాఖ్యానించారు.కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ, ఈ సంస్థలు నగరంలో మరిన్ని శాఖలను విస్తరించాలని ఆకాంక్షిస్తూ, యాజమాన్యానికి, సిబ్బందికి తన శుభాకాంక్షలు తెలిపారు.
సంస్థ సీబీఓ వర్షా భూతి అనంతరం ‘ఒటో’ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వర్షా పోతి శివశంకరన్ మాట్లాడుతూ విజయవాడలో తమ మినిస్టర్ వైట్ 69వ షోరూమ్‌ను (విజయవాడలో 2వది), అలాగే మొదటి ఒటో షోరూమ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ బ్రాండ్లకు భారీ ఆదరణ, అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సాంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ డిజైన్లతో కూడిన పురుషుల వస్త్రాలను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థపై నమ్మకం ఉంచి ఆదరిస్తున్న వినియోగదారులకు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News