తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో స్టార్బక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకర్ష్ ఇన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఆకర్ష్ ఇన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి నగరానికి వచ్చే భక్తులు, పర్యాటకులు మరియు సందర్శకులకు నాణ్యమైన ఆతిథ్య సేవలు అందించడంలో ఆకర్ష్ ఇన్ ముఖ్యపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రారంభమైన ఈ సంస్థ విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం ఆకర్ష్ ఇన్ యాజమాన్యం ఆకర్ష్ & కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News