ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు- ఎస్.టి.యు

-ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి.. ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలి- ఎస్.టి.యు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక టెట్ నిర్వహించాలని, ఆ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని, డిపార్ట్‌మెంటల్ పరీక్షల మాదిరిగా ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలని ఉపాధ్యాయ సంఘాలుగా అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారికి ప్రాతినిధ్యాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈరోజు విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేదా వెసులుబాట్లు కల్పించకుండా CBT విధానంలోనే పరీక్ష నిర్వహించడం, అంతేకాకుండా వివిధ వర్గాలకు వేర్వేరు ఉత్తీర్ణత మార్కులను నిర్ణయించడం సీనియర్ ఉపాధ్యాయుల పట్ల అన్యాయంగా ఉందని వారు ఆక్షేపించారు.
దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వివిధ రకాల శిక్షణలు పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను కొత్తగా అభ్యర్థులుగా పరిగణించి అదే ప్రమాణాలతో టెట్ పరీక్షకు హాజరు కావాలని చెప్పడం సమంజసం కాదన్నారు.
సీనియర్ ఉపాధ్యాయుల అనుభవాన్ని ప్రభుత్వం గుర్తించాలి
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల బోధనా అనుభవం, ఇప్పటికే పొందిన వృత్తిపరమైన శిక్షణ, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని వారికి ప్రత్యేక నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వయస్సు, దీర్ఘకాలిక సేవ, పాఠశాలల్లో ఉన్న బోధనా బాధ్యతలను పరిగణనలోకి తీసుకోకుండా CBT పరీక్ష విధానాన్ని అమలు చేయడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.
ప్రత్యేక టెట్‌కు ప్రత్యేక విధానం అవసరం
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించి, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహించాలని, డిపార్ట్‌మెంటల్ పరీక్షల మాదిరిగా 40 శాతం ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
టెట్ నోటిఫికేషన్‌ను తక్షణమే సవరించాలి
ఇప్పటికే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి కి పలుమార్లు ప్రాతినిధ్యాలు సమర్పించిన నేపథ్యంలో, తాజాగా విడుదలైన టెట్ నోటిఫికేషన్‌ను పునఃపరిశీలించి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని కోరారు.
ప్రభుత్వం సీనియర్ ఉపాధ్యాయుల అనుభవాన్ని గౌరవిస్తూ టెట్ నోటిఫికేషన్‌లో తక్షణమే సవరణలు చేయాలి. ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి, ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయడంతో పాటు, దీర్ఘకాలికంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు తగిన మినహాయింపులు కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర ఎస్.టి.యు) డిమాండ్ చేస్తున్నది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *