నిజమైన పరిష్కారమే.. నిబద్ధతకు నిదర్శనం

– కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సాకారం కావాలి
– ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానం
– జిల్లాస్థాయి ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్‌కు 192 అర్జీలు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును కేవలం అర్జీగా కాకుండా.. ఒక కుటుంబం లేదా వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యగా భావించి సత్వర, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం కాగితాలపై లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పూర్తికాదని, సమస్యకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిష్కారం లభించినప్పుడే అది నిజమైన పరిష్కారంగా పరిగణించాలని స్పష్టం చేశారు.
క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో సోమ‌వారం జ‌రిగిన ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి అర్జీలు స్వీక‌రించారు. మొత్తం 192 అర్జీలు అంద‌గా రెవెన్యూ 66, పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి 52, పోలీసు 22, పంచాయ‌తీరాజ్‌కు 17 అర్జీలు రాగా వైద్య ఆరోగ్యం, స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు శాఖకు ఆరు చొప్పున అర్జీలు అందాయి. వ్య‌వ‌సాయం, ప్ర‌జా ర‌వాణా, కాలేజీ విద్య‌, పాఠ‌శాల విద్య‌, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌, ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖల‌కు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. విద్యుత్‌, పౌర సర‌ఫ‌రాలు, స‌హ‌కార‌, అట‌వీ, ఆర్ఐవో, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా, గిరిజ‌న సంక్షేమం శాఖ‌ల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి. వీటిని క్షుణ్నంగా ప‌రిశీలించి ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు ప్ర‌జ‌ల‌తో ప్రత్యక్షంగా మాట్లాడి, సమస్య పరిష్కారమైన తీరును తెలుసుకోవడంతో పాటు వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని సూచించారు. తీసుకున్న చర్యలు, పరిష్కారం వివరాలు స్పష్టంగా ఉండేలా ఎండార్స్‌మెంట్లు రూపొందించాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమాన‌మ‌ని.. పాల‌న‌పై ప్రజలకు నమ్మకం మరింత పెరగాలంటే ప్రతి ఫిర్యాదుకు నిజమైన, పారదర్శకమైన, క్షేత్రస్థాయి పరిష్కారం అందాల‌న్నారు. పీజీఆర్‌ఎస్‌ను ప్రజలకు అండగా నిలిచే సమర్థవంతమైన వ్యవస్థగా మరింత బలోపేతం చేసేందుకు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని పేర్కొన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు సహా సంబంధిత అధికారులు ఆన్‌లైన్ సమీక్షలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సమీక్షల్లో ప్రస్తావించే ప్రతి అంశంపై స్పష్టమైన వివరాలు అందిస్తూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆదేశించారు. అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా, ఫిర్యాదుల పరిష్కారంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, జెడ్‌పీ సీఈవో జె.అరుణ‌, పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి జె.జ్యోతి, వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *