ర్యాంప్ తో హరిత బాటలో ఎంఎస్ఎంఈలు

-ఈఈఎస్ఎల్, సీఐఐ సంయుక్తంగా విజయవాడలో అవగాహన సదస్సు
-ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, వనరుల సమర్థ వినియోగంపై వర్క్ షాప్
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కృషి, చొరవ ప్రత్యేక చర్చ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంఎస్ఎంఈలను పర్యావరణహిత ఉత్పత్తి విధానాల వైపు ప్రోత్సహించడంతో పాటు, ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, వనరుల సమర్థ వినియోగం ద్వారా వాటి పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) కార్యక్రమం కింద విజయవాడలో అవగాహన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్ఎంఈల హరితీకరణ అంశంపై విజయవాడ గాంధీనగర్ లోని హోటల్ శ్రీ కుబేర గ్రాండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్), సీఐఐ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రారంభ సమావేశంలో ఎన్‌టీఆర్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎం.మధు పాల్గొని ఎంఎస్ఎంఈలు ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన హరిత ఉత్పత్తి విధానాలను అవలంబించాలని సూచించారు. విజయవాడ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ మాజీ చైర్మన్ ఈ. ఫణి పూర్ణ చంద్రరావు, ఏపీ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ వలేగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రీమెన్ ఏపీ విభాగం కార్యదర్శి అమర్‌నాథ్ ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
కార్యక్రమంలో ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్, ఎంఎస్ఎంఈలకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయం తదితర అంశాలపై సాంకేతిక అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన పారిశ్రామిక సమూహాల్లో నిర్వహిస్తున్న పెట్టుబడి స్థాయి ఇంధన సామర్థ్య పరిశీలనలు, నీటి వినియోగ పరిశీలనలలో ఎంఎస్ఎంలు పాల్గొని, ఇంధనం, నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు వ్యయాలను ఆదా చేసుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్‌టీఆర్ జిల్లాలోని ముద్రణ, లోహ పోత పరిశ్రమల పారిశ్రామిక సమూహాలకు చెందిన 60కిపైగా ఎంఎస్ఎంఈలు కార్యక్రమంలో పాల్గొని ఇంధన పొదుపు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఆర్థిక సహాయం, పర్యావరణహిత వ్యాపార విధానాలపై చర్చించారు.
హరిత సాంకేతికతలను స్వీకరించడం ద్వారా ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరత్వం మరింత మెరుగుపడుతుందని, అందువల్ల హరిత ఎంఎస్ఎంఈల అభివృద్ధి కార్యక్రమంలో పరిశ్రమలు చురుకుగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *