వెలిగొండ ప్రాజెక్టు చంద్రబాబు కష్టానికి ప్రతిఫలం

-పదవులు శాశ్వతం కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది
-జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారు -మాజీ మంత్రి దేవినేని ఉమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు దశాబ్దాలుగా చంద్రబాబు గారు చేసిన కృషి, పట్టుదలకు ప్రతిఫలమే వెలిగొండ ప్రాజెక్టు అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరిచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. గొల్లపూడి లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు మరిచిపోలేదని, ఆ పాలనపై ప్రచురించిన పుస్తకాలను ఒక్కసారి చదివు కోవాలని హితవు పలికారు. 48 ఏళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు గారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తుంటే.. జగన్‌ చేస్తున్న పిల్లచేష్టలను ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పులివెందులకు నీళ్లు ఎవరు ఇచ్చారు.. ఎలా వచ్చాయో అక్కడి రైతులను, ప్రజలను అడిగితే వాస్తవాలు చెబుతారని దేవినేని ఉమా అన్నారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్‌, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. బీసీలపై ఐదేళ్లలో చేసిన అరాచకాలను మరిచిపోయి నేడు కపట ప్రేమ చూపిస్తూ శ్రీరంగనీతులు చెప్పడం జగన్‌కే చెల్లిందన్నారు.

పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై విషం చిమ్మాలని జగన్‌ చేసిన ప్రయత్నాలను ఉపాధ్యాయులు తిప్పికొట్టారని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నుంచి చుక్క నీరు రాకపోయినా కృష్ణా డెల్టాను కాపాడుకున్నామంటే అది చంద్రబాబు గారి దార్శనికతకు నిదర్శనమన్నారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన 30 టీఎంసీల నీటిని చూసైనా జగన్‌లో మార్పు వస్తుందని భావిస్తే.. ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేకపోయారని విమర్శించారు.

వెలిగొండ, తోటపల్లి సహా రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని పూర్తి చేసిన ఘనత చంద్రబాబు గారిదేనని దేవినేని ఉమా పేర్కొన్నారు. నేడు నిర్వాసితుల గురించి మాట్లాడుతున్న జగన్‌.. నాడు ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో గుర్తు చేసుకోవాలని సూచించారు.‌ పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు నాశనం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలు ఇప్పటికే సస్యశ్యామలమయ్యేవని అన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ సమన్వయంతో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలను కాపాడుతుంటే.. అసలు నీళ్లే రావంటూ జగన్‌ శాపనార్థాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

జగన్‌కు నీళ్లపై శ్రద్ధ లేదని, పంచభూతాలపై గౌరవం లేదని దేవినేని ఉమా విమర్శించారు. ఐదేళ్ల అరాచక పాలనను మరిచిపోయి ఇప్పుడు ఏకగ్రీవాల గురించి జగన్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకున్న జగన్‌ రాజకీయాలకు ప్రజలు ఇక చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని దేవినేని ఉమా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *