విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం..

-కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం: ఎంపీ కేశినేని చిన్ని..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బుద్ధ వెంకన్నతో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గత పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలను అందజేస్తున్నామని ఎంపీ తెలిపారు. ప్రజల సమస్యలను కూడా నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కేడర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు. కూటమి ఐక్యతే తమ బలమని, ప్రజల కోసం సమష్టిగా పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై సానుకూలంగా స్పందిస్తున్నారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా కూటమి నేతలు, కార్యకర్తల సమన్వయంతో కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని చేరవేస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ టిడిపి ఇన్చార్జ్ బుద్దా వెంకన్న, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, సోలంకి రాజు కొట్టేటి హనుమంతరావు, రేగళ్ల లక్ష్మణరావు, డివిజన్ ప్రెసిడెంట్ మురళి, పిళ్ళా సుదర్శన్, సురభి బాలు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *