శారద కళాశాలలో ఆంధ్ర చెస్ ఆకాడమీ ఏర్పాటు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక గాంధీనగర్‌లోని శారద కళాశాలలో మంగళవారం నుండి ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శారద కళాశాల ఎడ్యుకేషనల్ సొసైటీ సహాయ సహకారాలతో మొట్టమొదటిసారిగా ఆంధ్ర చెస్ ఆకాడమీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనఎమ్ ఫణికుమార్ తెలిపారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఎమఓయును కళాశాలలో రెండు అసోసియేషన్లలు కళాశాల యాజమాన్యంతో చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదరంగం నేర్చుకోవాలి అని అసక్తి కలిగిన విద్యార్థుల కోసం ప్రతి మంగళ, గురు, శనివారాలలో శిక్షణా తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు. అధిక ఫీజులు చెల్లించలేక ఆటకు దూరమవుతున్న వారి కోసం మంచి అనుభవం కలిగిన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ అందించబడుతుందని, ప్రతినెల రెండు జిల్లా టోర్నమెంట్లు నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ సీఏ కుందా రామనారాయణ, ట్రెజరర్ ఎసఎన్ వరప్రసాద్, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ రేణుక, ఎసఆరఆర్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ రేష్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *