విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాద చారులు మరియు వాహన చోదకులకు అవరోధం కలిగిస్తూ, రోడ్ మార్జిన్ నందు దీర్ఘకాలికoగా వదిలి వేసిన సామగ్రిని తొలగించాలనే నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మూలన దళ సిబ్బంది ద్వారా నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళిపార్క్, రెడ్ సర్కిల్, బిషప్ హాజరయ్య స్కూల్ ప్రాంతాలలో నిరుపయోగంగా పడి ఉన్న తోపుడు బండ్లు, పాత బడ్డిలు తదితరములను తొలగించుట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అవరోధo కలిగించే వారిపై తగు చర్యలు తిసుకోనబడునని పట్టణ ప్రణాళిక అధికారులు హెచ్చరించారు.
Prajavartha Online Telugu News