-ఇది ఉద్యోగ, కార్మిక వర్గాలపై దాడిగానే భావిస్తాం
-ఎన్నికల హామీలు అడిగితే ఎదురు దాడులా ?
-ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే బెదిరింపులా ?
-హక్కులు అడిగితే నిరాకరించడం దారుణం
-తక్షణమే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు చేపట్టాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ సంఘాల నేతలు తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ..వారిపై మాటలతో దాడులకు దిగడం దారుణమని, ఇది ఉద్యోగ, కార్మిక వర్గాలపై దాడిగానే తాము భావిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా చిత్తశుద్ధితో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్ని పరిష్కరించకుండా..పైపెచ్చూ ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాలు చేస్తున్నారని, అసత్య విషపూరితంగా రెవెన్యూశాఖ మంత్రి మంత్రి అనగాని సత్య ప్రసాద్ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఈశ్వరయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికý మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వమే ఇచ్చిన హామీలను అమలుపై అడిగిన ఉద్యోగ సంఘాల నేతలను ఎదురు దాడులకు తెగబటం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఎత్తిచూపితే బెదిరింపులకు దిగడం, ఉద్యోగుల హక్కులు అడిగితే నిరాకరించడం చూస్తుంటే…చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, ఉద్యమాలు చేయడం సర్వసాధారణమని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారంలోకి వచ్చాక మరొక రకంగాను ఉద్యోగుల పట్ల వ్యవహరించడం తగదని సూచించారు. ఉద్యోగ సంఘాలు సైతం తమ హక్కుల కోసం పోరాడుతుంటే..కొన్ని సంఘాలతో ప్రభుత్వం వారిపై విమర్శలు చేసేలా ప్రోత్సహించడం తగదని, దీనిపై ఉద్యోగ సంఘాలు విజ్ఞతో ఆలోచించాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన మÖడు దశల ఉద్యమ కార్యాచరణకు కార్మిక సంఘాలతోపాటు దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయన్నారు. మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహించి దాదాపు 40 రోజులవుతోందని, ఆయా డిమాండ్లు, అంశాల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీస్కెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు చర్చల సారాంశం సైతం ఉద్యోగ సంఘాల నేతలకు తెలియజేయకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగుల హక్కులను నీరుగారుస్తున్నారని, కార్యాచరణ ప్రకటించినందుకుగాను వారిపై నినందలు, బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగుల సమస్యలపై ఎంతో సానుకూలంగా ఉన్నట్లు కన్పించిందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి డీఏ, పీఆర్సీ, ఐఆర్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. మొత్తం 29 డిమాండ్లు, పాత, కొత్తవి కలిపి రూ.40వేల కోట్ల ఉద్యోగుల బకాయిల విడుదల కోసం రెండున్నరేళ్లపాటు ఉద్యోగ సంఘాల నేతలు వేచిచూసి…ఆ తర్వాత తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడగటమే నేరగా భావించడం తగదన్నారు.
ఉద్యమ కార్యాచరణకు ప్రకటించిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎదురుదాడితో, రాజకీయ రంగు పులుముతూ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే..ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వర్గాలను భయబ్రాంతులకు గురిచేసేలా ఉందన్నారు. మంత్రి అనగాని మాటలు చూస్తే.. ‘ఉద్యోగులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్న సమయంలో బొప్పరాజు వ్యవహరిస్తున్నార తీరు సరికాదని, ఉద్యోగుల అజెండాగా బొప్పరాజు పనిచేస్తున్నారా?, లేక రాజకీయ అజెండాతో పనిచేస్తున్నారా?, బొప్పరాజు వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేయడం చేస్తున్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు చేశార’ని ఈశ్వరయ్య తెలిపారు. ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం మÖడు దఫాలుగా చర్చలు నిర్వహించిందని వివరించారు. జులై 10, 11తేదీýతోపాటు 22వ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు నిర్వహించిందన్నారు. అప్పటి నుంచి ప్రభుత్వంతో కొనసాగుతున్న చర్చలు, హామీల కారణంగా ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన ఉద్యమ కార్యాచరణ వాయిదా వేశారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..ఉద్యోగ సంఘాల నేతలు వారి హక్కుల కోసం పోరాడతారని, ఈ విషయం కూటమి నేతలూ గుర్తెరగాలని సూచించారు. రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని, రూ.40 వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్న బకాయిలు, డీఏలు చెల్లిస్తామని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని మంత్రులు, ఐఏఎస్ అధికారుల సమక్షంలో చర్చలే తప్ప..ఆచరణలో పెట్టకుండా ఉద్యోగ సంఘాలు నాయకులపై అవాకులు చవాకులు పేలడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను వేతనాలు పెంచి..వారిని క్రమబద్దీకరిస్తామని, తక్కువ జీతాలు తీసుకుంటున్న స్కీమ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం మినహా.. ఆచరణలో ఎక్కడ సాధ్యం కాలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశం అంటుతున్న 73 షెడ్యూలులోని కార్మికుల వేతనాలు 10 నుంచి 15 సంవత్సరాలుగా పెరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేస్తుంటే.. టెంట్లు వద్దకు కూటమి నాయకులు వచ్చి..మేము అధికారంలోకి వచ్చాక తీరుస్తామన్న మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. పెరిగిన ధరలతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగితోనైనా తమకు పీఆర్సీ, డీఏలు వద్దని, వేతనాలు పెంచవద్దని చెప్పించగలరా? అని ఆయన సవాల్ విసిరారు. ఒక వైపు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు ఎప్పుడైనా సిద్ధమని చెబుతుంటే..ప్రభుత్వం వారిని ఎందుకు ఆహ్వానించడం లేదన్నారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్ తదితర బకాయిలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు, వైద్య బిల్లుల సమస్యల్ని పరిష్కరించాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఆరా తీయాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే పేరుతో ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యల్ని రెండున్నరేళ్లుగా వాయిదా వేస్తూ, కాలయాపన చేయడం సరికాదన్నారు.
Prajavartha Online Telugu News