ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, పిర్యాదులను పూర్తి స్తాయిలో పరిష్కరించి, అవి మరల పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తుందని, అధికారులు కూడా ప్రజల నుండి అందిన పిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదుల పై తక్షణ స్పందన ఉండాలన్నారు. అర్జీల్లో ఏదైనా సమస్య పరిష్కారానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పిజిఆర్ఎస్ ద్వారా 49 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 11, ఇంజినీరింగ్ విభాగం 21, రెవెన్యూ విభాగం 9, ప్రజారోగ్య విభాగం 5, ఉపా సెల్ విభాగం 2 , అకౌంట్స్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.
కార్యక్రమంలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిసిపి సూరజ్ కుమార్, ఏఓ తిరుపతి నాయుడు, మేనేజర్ బాలాజీ బాషా, విభాగాధిపతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *