గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు సంబందించి మిగిలియున్న పనులు 10 రోజుల్లోపు పూర్తి చేసి, రోడ్డు మరియు సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్, ఏపిసిపిడిసిఎల్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు రోడ్ విస్తరణ పనులు అన్ని విభాగాల సమన్వయంతో యుద్దప్రాతిపదికన వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సదరు ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే లోపు త్రాగు నీటి పైప్ లైన్ షిఫ్టింగ్, అండర్ గ్రౌండ్ డ్రైన్ పనులు, కరెంట్ పోల్స్ షిఫ్టింగ్, మరియు బి.యస్.యన్.యల్, ప్రైవేట్ నెట్ వర్క్స్ కు సంబంధించిన కేబుల్స్ షిఫ్టింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులు ఏపియుఐఎఎంఎల్ ప్రతినిధులు అందజేసిన డిజైన్ల ప్రకారం పనులను నిర్వహించాలని, అందుకు సదరు ఏపియుఐఎఎంఎల్ ప్రతినిధులతో కలిసి పనిచేయాలన్నారు. ఇంకా రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవన నిర్మాణాల వారితో మాట్లాడి, వారికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు జరిగే సమయంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, విస్తరణలో తొలగించిన చెట్లను వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని చుట్టుగుంట వద్ద గల చంద్రభాను కుంట రోడ్డు విస్తరణకు సంబంచిన మ్యాపులను పరిశీలించి, త్వరితగతిన రోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఏ.సి.పి రెహమాన్, డి.ఈ.ఈ వెంకటరమణ, ఎలక్ట్రిసిటీ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News