జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన వాట్ వెల్ఫేర్ సెక్రెటరీ మరియు తన తనయుడికి కి గోల్డ్ మెడల్స్

-అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్‌లోని కాటేదాన్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన ఓపెన్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన తండ్రీకొడుకులు విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఉప్పాల మురళీ మోహిత్, ఉప్పాల కోటేశ్వరరావులను కమిషనర్ అభినందించారు.

యనమలకుదురుకు చెందిన 10 ఏళ్ల ఉప్పాల మురళీ మోహిత్ ఎల్లో బెల్ట్ కట విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. మురళీ మోహిత్ విజయ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. అదేవిధంగా యనమలకుదురుకు చెందిన ఉప్పాల కోటేశ్వరరావు 40 ఏళ్ల వయస్సులో ఎల్లో బెల్ట్ కట విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణతో పాటు క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కోటేశ్వరరావును, చిన్న వయస్సులోనే కరాటేలో ప్రతిభ కనబరుస్తున్న మురళీ మోహిత్‌ను అభినందించారు. తండ్రీకొడుకులు క్రీడా రంగంలో సాధిస్తున్న విజయాలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. క్రీడలతో పాటు విధి నిర్వహణలోనూ అంకితభావంతో ముందుకు సాగుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *