గురజాడ అప్పారావు సాహిత్యం సమాజానికి స్ఫూర్తిదాయకం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురజాడ అప్పారావు సాహిత్యం సమాజానికి స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ప్రముఖ కవి, రచయిత గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిబ్బందితో కలిసి గురజాడ అప్పారావు సాహిత్య సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని అన్నారు. తన రచనల ద్వారా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా “కన్యాశుల్కం” నాటకం ద్వారా అప్పటి సమాజంలో ఉన్న బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎత్తిచూపి, సంస్కరణల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారని అన్నారు.

“దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్” అనే గురజాడ సందేశం సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ ఉన్న బాధ్యతను గుర్తుచేస్తుందని కమిషనర్ తెలిపారు. గురజాడ అప్పారావు ఆశయాలు, సామాజిక చైతన్య సందేశం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె. దుష్యంత్, ఎక్సమినేర్ ఈఫ్ అకౌంట్స్ ఎస్. ఎన్. చక్రవర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *