శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాన్ని సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం, ఎవిఎస్ రోడ్డులో, చలసాని గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన వినాయక చవితి మహోత్సవాల ప్రాంగణంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ వేడుకలను జరుపుకుంటూ ఈ ఏడాది 10వ వార్షిక ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ఈరోజు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. గురువారం వేలంపాట నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 30 రూపాయల లక్కీడ్రా కూపన్ ద్వారా 5 కేజీల లడ్డూ ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి పాల్గొని సహకరించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *