దైవాలపై దాడులా..?

-జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం
-గురువులపై గొడ్డలి పార్టీ నాయకుల దాడులు క్షమించరాని నేరం
-మెగా డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు
-ఇదే మాట స్పష్టం చేసిన హైకోర్టు, విద్యాశాఖాధికారులు
-లిక్కర్ కేసుల నుంచి డైవర్షన్ కోసం దాడులు
-జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి
-మెగా డీఎస్సీపైనా, గ్రూప్ 1 మూల్యాంకనంపైనా చర్చకు రెడీ
-జగన్ మాటలు నమ్మితే జైలుకే…
-రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
-వైసీపీ క్యాడర్ కు మంత్రి సవిత హెచ్చరిక

పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
‘గురు బ్రహ్మ, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః అంటూ గురువులను దైవంగా కొలుచుకునే సమాజం మనదని, అటువంటి దైవాలపై గొడ్డలి పార్టీ గూండాలు దాడి చేయడం దారుణం… ఒకవైపు లిక్కర్ స్కామ్, మరో వైపు గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనంలో అక్రమాలు బయటకు రావడంతో జగన్ బ్యాచ్ లో గగ్గోలు మొదలైంది… టీచర్ల ఆత్మగౌరం దెబ్బతిసేలా, వారిని కష్టాన్ని తక్కువ చేసి చూపేలా మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ విష ప్రచారం మొదలు పెట్టారు…రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ…టీచర్లపైనా, సామాన్యులపైనా దాడులు చేస్తే ఊరుకోబోమని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం..’అని జగన్ ను, వైసీపీ నాయకులను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే మెగా డీఎస్సీ, గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ కార్యకర్తలను జగన్ రెడ్డి పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఆయన మాటలు నమ్మి దాడులకు తెగబడితే నష్టపోయేది వైసీపీ కార్యకర్తలేనన్నారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తమకష్టాలు చెప్పుకోడానికి వచ్చిన టీచర్లపై గొడ్డలి పార్టీ గూండాలు దాడులు చేయడం బాధాకరమన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః అంటూ గురువులను దైవంగా కొలిచే సమాజం మనదన్నారు. అటువంటి దైవాలపై జగన్ గ్యాంగ్ దాడులు చేయడం క్షమించరాని నేరమన్నారు. 2025 మెగా డీఎస్సీలో టీచర్ అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడి లక్ష్యం సాధించారన్నారు. అటువారి కష్టాన్ని తక్కువ చేసి చూపుతూ, ఆత్మగౌరవం కించపరిచేలా నీలి మీడియాలో విషపు రాతలు రాస్తూ గొడ్డలి పార్టీ నాయకులు రాక్షాసానందం పొందుతున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.

దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా…

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంత్రి నారా లోకేశ్ ఎంతో పారదర్శకంగా, అక్రమాలకు తావులేకుంటే 2025 మెగా డీఎస్సీ నిర్వహించారని మంత్రి సవిత కొనియాడారు. స్పోర్ట్స్ కోటాలోగాని, మరేకోటాలోగాని ఎటువంటి అక్రమాలు జరగలేదని హైకోర్టు, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారన్నారు. కనీస అవగాహన కూడా లేకుండా జగన్, గొడ్డలి పార్టీ నాయకులు మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే మెగా డీఎస్సీపైనా, ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 1 మూల్యాంకనంపైనా చర్చకు రావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు.

డైవర్షన్ కే దాడులు

గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనం ఎల్.కె.జి. విద్యార్థుల మాదిరిగా మూడు పర్యాయాలు దిద్దారని సిట్ నివేదికలో బయటపడిందని మంత్రి సవిత తెలిపారు. లిక్కర్ కుంభకోణంలో జగన్ సహా వైసీపీ పెద్ద తలకాయలు అరెస్టయ్యే అవకాశముందనే వార్తలు మీడియాలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ వార్తల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి విజయవాడలోని శాప్ కార్యాలయంపైనా, ఉపాధ్యాయులపైనా గొడ్డలి పార్టీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. సమాజాన్ని ఉన్నతమార్గంలో పయనించేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై జగన్ పార్టీ నాయకులు, గూండాలు దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడులకు తెగబడితే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సవిత హెచ్చరించారు.

జగన్ కు పావులు కావొద్దు

జగన్ రాజకీయ కుట్రలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పావులు కావొద్దని మంత్రి సవిత హితవు పలికారు. జగన్ కు ప్రజాస్వామ్యంపైనా, చట్టాలపైనా గౌరవం లేదని, ఆయన మాటలు నమ్మి దాడులు చేస్తే జైలు పాలవ్వడం ఖాయమని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. అయిదేళ్ల జగన్ అసమర్థ పాలన, రెండేళ్ల సీఎం చంద్రబాబు పాలన బేరీజు వేసుకుకోవాలన్నారు. జగన్ ను నమ్ముకుంటే జైలేనని, చంద్రబాబును నమ్మకుంటే అభివృద్ధి అని వైసీపీ నాయకులకు మంత్రి సవిత హితవు పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *