Breaking News

ప్రశాంతంగా ముగిసిన ప్రత్యేక టెట్‌ పరీక్షలు

-97.46 శాతం మంది ఉపాధ్యాయుల హాజరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఏపీ స్పెషల్‌ టెట్‌–2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్‌ 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 73 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించారు. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 83,015 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, 80,907 మంది హాజరయ్యారు. దీంతో 97.46 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు పూర్తయ్యాయని ఏపీ స్పెషల్‌ టెట్‌–2026 కన్వీనర్‌ ఎం.వి. కృష్ణారెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …