Breaking News

45వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్మయ్యకు మూడు పతకాలు.. లక్నో జాతీయ పోటీలకు ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
45వ ఏపీ మాస్టర్స్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారుడు లక్ష్మయ్య అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆయన అర్హత సాధించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (MAFI) ఏపీ బ్రాంచ్ ఆధ్వర్యంలో 45వ ఏపీ మాస్టర్స్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఎన్టీఆర్ జిల్లా నుంచి 45 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీపడ్డారు.
ఈ పోటీల్లో లక్ష్మయ్య 800 మీటర్ల పరుగు, హర్డిల్స్, లాంగ్‌జంప్‌ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. తన ప్రతిభతో ఒక బంగారు పతకం, రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో మూడు పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. లక్ష్మయ్య సాధించిన ఈ విజయంపై ఎన్టీఆర్ జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ లక్ష్మయ్య తన ప్రతిభను చాటుకుని మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …