Breaking News

ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లింపు…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగములో అవుట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న దేవర రామలక్ష్మి ది.01-11-2021 తేదిన నైట్ శానిటేషన్ నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుండి లారీ గుద్దడముతో ప్రమాదానికి గురై సంఘటన స్థలములోనే మరణించుట జరిగిన దర్మిలా సోమవారం మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదగా ఆమె ఛాంబర్ నందు వారి కుటుంబ సభ్యులు భర్త సన్యాసి అప్పడు మరియు కుమార్త దేవర సౌజన్య లకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెక్కు అందించుట జరిగింది. కార్యక్రమములో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు యర్రగొర్ల తిరుపతమ్మ 64వ డివిజన్, తంగిరాల రామిరెడ్డి, 19వ డివిజన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *