Breaking News

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి…


-యాజమాన్యం ప్రస్తుతం పాత్రికేయులను సేల్స్‌మెన్స్‌వలె ఉపయోగించుకుంటున్నారు…
-శాసనమండలి సభ్యులు డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పత్రికారంగంలో వున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ‘సూర్య’ దినపత్రిక డైరీ ఆవిష్కరణకు ఎమ్మెల్సీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయ వ్యవస్థ యాజమాన్యం ప్రస్తుతం పాత్రికేయులను సేల్స్‌మెన్స్‌వలె ఉపయోగించుకుంటున్నారని, నిత్యం వాణ్యి ప్రకటనలు తీసుకురావాలని ఒత్తిడి తీసుకురావడం వల్ల పాత్రికేయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పాత్రికేయులకు నివేశన స్థలాలు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తప్పక ఇస్తుందని ఆయన తెలియజేశారు. నందిగామ నియోజకవర్గంలో పాత్రికేయులకు నివేశన స్థలాలు లేక ఎంతో ఇబ్బందిపడుతున్నారని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పాత్రికేయునికి నివేశన స్థలం ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తుందని ప్రెస్‌క్లబ్‌కు కావలసిన ఆర్థిక సహాయాన్ని అభివృద్ధి నిమిత్తం తనకు ఉన్నంతలో శక్తి కొలది సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘సూర్య’ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని, నేటి పోటీ ప్రపంపంచలో పెద్ద పత్రికలతో ధీటుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ‘సూర్య’ దినపత్రిక ఎడిటర్‌ కన్నెగంటి.సజ్జనరావు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో పత్రిక నడపడమంటే కత్తిమీద సాములాగా తయారై నడపటం గగనం అవుతున్న ఈ సమయంలో పాత్రికేయులు జీతాలు లేకపోయినా పాత్రికేయ వృత్తిని నమ్ముకుని యాజమాన్యాల యాడ్స్‌ ఒత్తిడిని తట్టుకుని ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ముందుకు వెళుతున్నారన్నారు. 5 వేల రూపాయలు యాడ్స్‌ తేవాలన్నా చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితిలో ఏ కష్టం వచ్చినా నేను వున్నాను అని భరోసా ఇచ్చే శాసనమండలి సభ్యులు డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ను కలిసిన ప్రతి జర్నలిస్టులకు లేదనుకుండా తనకు చేతనైనంతలో ఆదుకుంటూ ఆయన జర్నలిస్టులకి ఇస్తున్న గౌరవాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఎపి యూడబ్ల్యుజే ఉపాధ్యక్షులు పి.సురేందర్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, దొండపాటి సుధాకర్‌, న్యాయవాదులు మంగళపూడి కోటి, ‘సూర్య’ గుంటూరు బ్యూరో రంగనాయకులు, న్యాయవాది వేల్పుల కోటయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *