-డిప్యూటీ సీఎం అంజాద్ బాబాను కోరిన అల్తాఫ్ బాబా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 11, 12, 13 తేదీలలో కొండపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాఋఖారి దర్గా 425 ఉరుసు మహోత్సవం జరగనుంది. ఈ ఉరుసు మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనాబ్ అంజాద్ భాషా ను ఆహ్వానించారు దర్గా ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా. శనివారం నాడు విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా శాలువా మరియు పుష్పగుచ్ఛం ఇచ్చి డిప్యూటీ సీఎంను సత్కరించారు. తప్పకుండా ఉరుసు మహోత్సవానికి హాజరవుతానని, బాబా గారి ఆశీస్సులు ఎల్లప్పుడు తనతోపాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తోడుగా ఉండాలని తెలిపారు. అనంతరం ఎన్ టి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ పద్మ సుజాత తో ఫోన్లో మాట్లాడి దర్గా అభివృద్ధి విషయంలో చొరవ తీసుకొని ఉరుసు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్ మీర్ హుస్సేన్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News