Breaking News

న‌మాజు స‌మయాల్లో విద్యుత్తు కోత‌లు లేకుండా చూడాలి…

-రాష్ట్ర ప్ర‌భుత్వానికి అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ అలీ రజా విజ్ఞ‌ప్తి

కొండ‌ప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌విత్ర రంజాన్ మాసం నేప‌ధ్యంలో న‌మాజు స‌మ‌యాల్లో మ‌సీదుల్లో విద్యుత్తు కోత‌లు లేకుండా చూడాల‌ని, మ‌సీదుల్లో పారిశుద్ధ్యాన్ని మ‌రింత మెరుగుప‌ర‌చాల‌ని, మంచినీరు నిరంత‌రం అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంతోషక‌ర వాతావ‌ర‌ణంలో పండ‌గ చేసుకునేలా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ అలీ రజా కోరారు. ఈ విష‌య‌మై శుక్ర‌వారం కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాఋఖారి ఆస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్తాఫ్ అలీ ర‌జా మాట్లాడుతూ ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ముస్లీం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌లుపైన‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబంపైనా అల్లాహ్ దీవెన‌లు ఉండాల‌ని ఆకాంక్షించారు. కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాఋఖారి ఆస్థానంలో ప్ర‌తిరోజూ ఎంతోమంది పేద‌ల‌కు ఏర్పాటు చేస్తున్న నిత్యాన్న‌దానంపై కొంత‌మంది కావాల‌ని అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *