ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశలో గ్రామ సచివాలయ, ఆర్ బి కె, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రల ఏర్పాటు జరిగింది…

బిక్కవోలు,నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశలో గ్రామ సచివాలయ, ఆర్ బి కె, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రల ఏర్పాటు జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం బలభద్రపురం గ్రామం లో రూ.61.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం -2, రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను స్థానిక శాసన సభ్యులతో కలిసి ఆమె ప్రారంభించారు.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన జిల్లాలో తొలిసారి గా గ్రామ సచివాలయం వంటి భవనాలు ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొనడం జరిగిందన్నారు. మీరు ఇంత అభిమానం చూపడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమం లతో పాటు అభివృద్ధి కార్యక్రమా లు పెద్ద ఎత్తున చేపడుతున్నారన్నారు. గతంలో పనులు కోసం అధికారులు చుట్టూ తిరిగే వారని, ఇప్పుడు వాలంటీర్లు మీవద్దకే రావడం జరుగుతోందన్నారు. భవిష్యత్ లో ప్రజలకు మరింత సుపరిపాలన అందించేందుకు శాశ్వతం గా భవనాలు నిర్మించి, స్థానిక యువతకే ఉపాధి కల్పన చేసారని మాధవీలత పేర్కొన్నారు.

శాసన సభ్యులు ఎస్. సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన తరువాత మన నియోజకవర్గం లోని సచివాలయం భవనం ప్రారంభించిన ఘనత సాధించుకున్నా మ్మన్నారు. ఈనెల 21 రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహనరెడ్డి బిక్కవోలు బలభద్రపురం పర్యటన సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ బి. రామారావు, ఎంపిపి కె. జ్యోతిర్మయి, ఎంపిటిసి ఎస్. సుజాత, జడ్పీటీసీ ఆర్. పద్మావతి, ఆర్డివో ఏ. చైత్ర వర్షిణి, ఎస్. మల్లిబాబు,స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్. వెంకటరెడ్డి, టి. శ్రీనివాస్ రెడ్డి , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *