Breaking News

ఈనెల 27వ తేదీ నుండి, మే 9 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు..

-ఉదయం 09.30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు..
-జిల్లాలో 28,680 మంది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థుల హాజరు…
-176 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు….
-176 మంది చీఫ్ సూపరింటెండెంట్లు నియామకం..
-1500 మందికి పైగా ఇన్విజిలేటర్లు నియామకం..
-ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు..
-కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణలో విద్యార్థులు పరీక్షలు వ్రాసేవిధంగా పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ .ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ బంగ్లా నుండి గురువారం పదో తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు విద్య, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, నగరపాలక సంస్థ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుండి మే తొమ్మిదో తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 28,680 మంది రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నారన్నారు. పరీక్షల నిర్వహణ కై 176 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 09.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు తదితర ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సబ్ ఇన్స్ పెక్టర్ స్థాయి పోలీసు అధికారి, రెవెన్యూ, విద్యాశాఖకు చెందిన అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షించాలన్నారు. పరీక్షలు జరిగే సమయాలలో ముక్యంగా పరీక్షలు జరిగే సమయంలో ఉదయం 8:30గంటల నుండి మధ్యాహ్నం 1:00గంట వరకు విద్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు,అవసరమైన మందులతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే విధంగా ఆయా కేంద్రాల రూట్లలో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి జిరాక్స్ సెంటర్లు తెరచి ఉండకుండా, పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలును పర్యవేక్షించే అందంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలిక్యులేటర్లు, పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదని ఇందుకు తగిన విధంగా కలెక్షన్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా అమలు చేస్తూ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కె. మోహన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *