
-ఆయుష్మాన్ భవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి….
-“ఆయుష్మాన్ భవ” ఆరోగ్య మేళాలో జిల్లా కలెక్టర్ ఎస్ .డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తూ పేదవారందరికీ ఆరోగ్య భద్రత కలిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ . ఢిల్లీ రావు అన్నారు . గురు వారం స్థానిక ఐవి ప్యాలస్ హాలలో నగర పాలక ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఆయుష్మాన్ భవ” ఆరోగ్య వైద్య శిబిరానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు,మాజీ మంత్రి ,శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ ,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, సబ్ కలెక్టర్ జిఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ హాజరై వైద్య శిబిరాన్నిప్రారంభించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నగరానికి స్మార్ట్ సిటీ అవార్డు రావటం పట్ల నగరపాలకసంస్థ అధికారులు సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం అని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్చరాలు అయిన సందర్బంగా మన దేశం 75 సంవత్చరాలలొ సాధించిన ప్రగతిని మనం ఈ సందర్భంగా ఉత్సావాలుగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతీవారం ఒక్కొక్క పథకంపై దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సావాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని కలెక్టర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రతీఒక్కరికి అవగాహన కల్పించటం ఆయుష్మాన్ భారత్ ముఖ్య ఉద్దెశ్యంఅన్నారు ప్రధానమంత్రి మాతృత్యయోజన పథకం,జననీసురక్ష యోజన,ప్రధానమంత్రిజన ఆరోగ్య యోజన పథకాలపై మరింతమందికి అవగాహన కల్పించి లబ్ది చేకూర్చాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.డిజిటల్ మిషన్ కార్యక్రమంలో హెల్త్ కార్డు జారీచేయటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమందికి వైద్య సదుపాయం కల్పించి, పునర్జన్మను ఇస్తున్నారని అన్నారు. నేడు 3,300 పైచిలుకు రోగాలను ఆరోగ్యశ్రీ పథకం లో చేర్చి ప్రతి పేదవాడు ఆరోగ్యంగా జీవించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లో ఉన్న వైద్య సిబ్బంది రోగుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయాలన్నారు. తల్లీబిడ్డ ఎక్సప్రెస్ , 104,108 వాహన సదుపాయాలను కల్పించటం జరిగిందన్నారు. హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మరింత పటిష్టం చేయాలన్నారు.రాష్ట్రంలోనే మాతా,శిశు మరణాల రేటు జిల్లాలో తక్కువగా నమోదు కావటం జరిగిందని,రానున్న రోజులలో మాతా శిశు మరణాలు జిల్లాలోజీరోగా నమోదుఅయ్యేటట్లు వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.
మాజీ మంత్రి, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ పెద్ద పీట వేసిందన్నారు. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు .
శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేసి ఆరోగ్య భరోసా కల్పిస్తున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల ఆరోగ్యం పట్ల తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని, ఈ పథకాలపై ప్రతి ఒక్కరు ఆవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులు కోరారు.
నగర మేయర్ రాయన బాగ్య లక్ష్మి మాట్లాడుతూఆరోగ్యశిబిరాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డి ,వైద్య ఆరోగ్య శాఖాధికారి డా .ఎమ్ .సుహాసిని, నగరపాలకసంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా .గీతాబాయ్ఉ న్నారు.
కార్యక్రమంలో తొలుత నేను సైతం ఎన్టీఆర్ జిల్లాను పొగాకు రహితజిల్లాగా మారుస్తాను…. అనే సిగ్నేచర్ క్యాంపైన్ పై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ జిఎస్ ఎస్ ప్రవీణ్ చంద్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంతకం చేశారు.
Prajavartha Online Telugu News