200 మందికి చీరల పంపిణీ 1000 మందికి అన్నప్రసాద వితరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ ఆంజనేయ బృందావన్ ఫ్రెండ్ సర్కిల్ మరియు విల్లా.వీర్రాజు ఆధ్వర్యంలో కోతి బొమ్మ సెంటర్ వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 200 మందికి చీరల పంపిణీ 1000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ప్రముఖ న్యాయవాది పిల్ల. శ్రీనివాస రావు ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పుల.గంగా జనసేన పార్టీ నాయకులు రెడ్డిపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వీర్రాజు మిరప బృందం ఆధ్వర్యంలో అన్ని దైవ కార్యక్రమాలను స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఎంతో భక్తిశ్రద్ధలతో అందరికీ ఆదర్శంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారని వీరికి మా తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మహేష్ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *