విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిణ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మజ్జిగ చలివేంద్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, సొసైటీ మేనేజర్ జి.శ్రీనివాస్, సొసైటీ సిబ్బంది వితరణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్వాణీమూర్తి మాట్లాడుతూ సొసైటీ గత రెండున్నర సంవత్సరాలలో 14 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసిందని తెలిపి, రానున్న రోజులలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతుందని, వాటి ద్వారా బ్రాహ్మణులందరూ రుణలబ్ది పొందాలని కోరారు.
ఈ సందర్భంగా మేనేజర్ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం గాయత్రి కన్వెన్షన్ హాలులో సొసైటీ యొక్క లోన్స్ మరియు డిపాజిటల్స్పై అవగాహన కార్యక్రమం వుంటుందని దానికి మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి అందరూ హాజరై సభ్యత్వం పొంది, రుణాలు పొందాలని కోరారు.
Prajavartha Online Telugu News