విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 50 బస్తాల వరకు యూరియా కొనుగోలు చేసే అవకాశం ఉన్నపట్టికి అవసరాలకు మించి అధనంగా యూరియా కొనుగోలు, అమ్మకాలు నిర్వహించిన వారిపై విచారించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. జిల్లాలో యూరియా కొనుగోలు, అమ్మకాలపై బుధవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆయన కార్యాలయం నుండి వ్యవసాయ అధికారులు, రైతులతో గూగుల్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల సరఫరా లభ్యతను పర్యవేక్షించేందుకు వ్యవసాయ అధికారులకు అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఎరువులను ఎక్కువగా కొనుగోలు చేసేవారిపై పూర్తి పర్యవేక్షణ చేయాలన్నారు. ఎన్‌టిఆర్ జిల్లాలో ఎనిమిది అవుట్‌లేట్‌ల ద్వారా యూరియా అధికంగా కొనుగోలు చేసిన 86 మంది కొనుగోలుదారులపై విచారించడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నం, మైలవరం, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఏసిఎస్) ద్వారా ఐదుగురు 250 బస్తాలు, నందిగామ, చందర్లపాడు, నూకనమ్మ ఎంటర్‌ప్రైజస్ నలుగురు 200 బస్తాలు, నందిగామ కంచికచర్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణం ద్వారా ఒకరు 50 బస్తాలు, నందిగామ వెంకట సాయి విత్తనాలు మరియు రైతు సంఘం ద్వారా 12 మంది 600 బస్తాలు, తిరువూరు గంపలగుడెం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) ద్వారా నలుగురు 200 బస్తాలు కనుమూరు, తిరువూరు గంపలగుడెం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) ద్వారా ఒకరు 50 బస్తాలు , వావిలాల, తిరువూరు, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) ద్వారా 51 మంది 2,550 బస్తాలు, కంకిపాడు, విజయవాడ రూరల్ మండలాలలో మార్కెఫెడ్ ఆర్‌బికె ద్వారా ఎనిమిది మంది 400 బస్తాలు, కలిపి మొత్తంగా 86 మంది 4,300 బస్తాల సంచుల యూరియాని కొనుగోలు చేసినట్లు డాష్‌బోర్డు ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. దీనిపై జిల్లాలోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, విచారణ జరిపి యూరియా కొనుగోలు అమ్మకాలలో అవకతవకలు జరిపిన్నట్లయితే ఫెస్టిలైజర్ కంట్రోల్ యాక్ట్ నిబంధనల ప్రకారం సంబంధిత డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి అమ్మకాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ సమయంలో డీలర్లలు ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం రైతుల అవసరాలకు సబ్సిడీపై యూరియాని సరఫరా చేస్తుందని యూరియా కొనుగోలు అమ్మకాలలో నిబంధనలను అత్రికమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి పర్యవేక్షణ భాధ్యతను నిర్వహించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గూగుల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయభారతి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News