విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటిఎస్, గృహ నిర్మాణాల గ్రౌండిరగ్ , వారం వారీగా నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న గృహా నిర్మాణాల ప్రస్తుత ప్రగతి, జగనన్న సంపూర్ణ గృహహక్కు పై బుధవారం గృహా నిర్మాణ శాఖ అధికారులు, యంపిడివోలు, మున్పిపల్ కమీషనర్లు, తహాశీల్థార్లతో నగరంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెస్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటిఎస్, గృహా నిర్మాణాల ప్రగతిని వారంవారీగా లక్ష్యాలను నిర్ధేశించామన్నారు. రెవెన్యూ , హౌసింగ్, పంచాయతీరాజ్, మున్సిపల్ కమీషనర్లతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గృహా నిర్మాణాల లబ్దిదారులు సకాలంలో గృహాలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత గృహా నిర్మాణాల పురోగతి, లేఅవుట్లలో అధికారులు కల్పిస్తున్న మౌలిక సదుపాయల కల్పనపై మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 940 గృహాలు నేటి వరకు ప్రారంభం కాలేదని, వీటిలో ఎక్కువగా విజయవాడ డివిజన్ పరిధిలో 890 వరకు ఉన్నాయని, వీటిలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలకు సంబంధించి 710 వరకు ఉన్న వాటిని లబ్దిదారులతో త్వరితగతిన ప్రారంభింప చేయాలన్నారు. బిలో బెస్‌మెంట్ స్థాయిలో ఉన్న 2,804 గృహాలను బెస్మెంట్ స్థాయికి, బెస్‌మెంట్ స్థాయిలోని 953 గృహాలను రూప్‌లెవల్ స్థాయికి, రూప్‌లెవల్ స్థాయిలో ఉన్న 187 గృహాలను రూప్ క్యాస్టింగ్ స్థాయికి, రూప్ క్యాస్టింగ్ స్థాయిలో ఉన్న 446 గృహాలను ఫినిషింగ్ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమ్మెంట్, ఐరన్ మెటిరియల్‌ను అందుబాటులో ఉంచాలని ఇందుకు సమస్యలు ఎదురైతే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ స్థాయిలలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్దిదారుల ఖాతాలకు ఎప్పటికప్పుడు నగదు జమ చేయాలని అన్నారు. గృహా నిర్మాణాలు పూర్తి అయిన లేఅవుట్లలో రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయాలను ఆయా శాఖల అధికారులు కల్పించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఓటిఎస్‌లో భాగంగా వివిధ స్థాయిలో పెండిరగ్ లేకుండా ఎప్పటికప్పుడు ప్రక్రియను పూర్తి చేసి లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. డిజిటల్ సిగ్నెచర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియోకాన్ఫరెస్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, జడ్పిసిఇవో సూర్యప్రకాష్, హౌసింగ్ పిడి వి శ్రీదేవి, ఇఇ బిఎస్ రవీకాంత్ ఉన్నారు.
Prajavartha Online Telugu News