విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృత వైపరిత్యాలు, తుఫానులు, వరదల వలన ఎటువంటి ప్రాణ, అస్తి నష్టం జరగకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. బుతుపవనాలు ప్రవేశిస్తున్న దృష్ట్యా ప్రకృతి వైపరిత్యాలు వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో బుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణంగా జూలై ఆగస్టు మాసాలలో అధిక వర్షాలు నమోదు అవుతామన్నారు. రాష్ట్రంలో కురిసే వర్షాలతో పాటు ఇతర రాష్ట్రాంలలో కురిసిన అధిక వర్షాల వలన వరద నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా పులిచింతల పాజెక్టుకు చేెరుకునే నీటిని దిగువనున్న ప్రకాశం బ్యారేజ్‌కి విడుదల చేస్తారన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి సామర్థ్యానికి మించి చేరుకున్న వదర నీటిని దిగువకు విడుదల చేసినప్పటికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతం ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. బుతుపవనాల కారణంగా జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయితే పంట నష్టాలకు గురి కాకుండా వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా వర్షాల వలన విజయవాడ నగరంలో పలు రోడ్లుపై నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలలో డ్రైనేజ్ సిస్టమ్‌ను మెరుగుపరచాలని కలెక్టర్ తెలిపారు. కనకదుర్గ వారది నుండి దిగువకు నిర్మిస్తున్న కృష్ణానదీ రిటైనింగ్ వాల్ వలన దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినప్పటికి కృష్ణలంక ప్రాంతానికి ఎటువంటి ముంపు ఇబ్బంది ఉండదన్నారు. 5 లక్షలకు మించి వరద నీరు విడుదల చేస్తే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ప్రణాళికతో సిద్దంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అవసరమైన చోట్ల మరమత్తులు పూర్తి చేయాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో తుఫానులు వరదలు కారణంగా పశువులకు ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో గొర్రెలు, మేకల పెంపకం దారులకు ఎప్పటికప్పుడు తుఫానులు వరదల సమాచారం అందించి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా పశుసంవర్థక శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపాలిటిలు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మలేరియా నివారణ మందులను సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఇ తిరుమలరావు, డిపివో చంద్రశేఖర్, డిఎస్‌వో కోమలి పద్మ, ఐసిడిఎస్ పిడి జి.ఉమాదేవి, అగ్రికల్చర్ ఆఫీసర్ అనితభాను, డిఎఫ్‌వో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి బి. రామారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News