Breaking News

వేట ఆగినా…. ప్రభుత్వ చలవతో పూట గడిచింది !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఏడాదిలో పది నెలల పాటు సాగరాన్ని మథించే సాహస జీవనాన్ని సాగిస్తుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే వీరు.. బతుకు పోరాటంలో దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. వేటే వీరి జీవనాధారం.. ఆ వేట ఆగితే.. ఆ పూట గడిచేది కడుభారం. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధించే వేట నిషేధం కాలంలో బతుకు జీవనం పెను సవాల్గా ఉండేది. వారి జీవితం.. విభిన్నం. అయితే, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పు ప్రారంభమైంది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపల పునరుత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వేటకు విరామం కల్పిస్తోంది. గత ప్రభుత్వాల కాలంలో అరకొర మందికి.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం.. 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా 61 రోజుల చేపల వేట నిషేధకాలంలో కృష్ణాజిల్లాలో మొదటి విడత లబ్ధిదారులకు గత మే నెల 13 తేదీన 10, 954 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల రూపాయల చొప్పున మత్స్యకారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయబడింది. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్లు పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది .
కృష్ణాజిల్లాలో 12 మండలాల పరిధిలో 111 కి.మీ. మేర సముద్ర తీరం ఉంది. ఆ తీరం వెంబడి ఉన్న కృత్తివెన్ను , మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు మండలాలలో పలు తీర గ్రామాలలో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 41 వేల మంది చేపల వేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు.

(1) కొక్కిలిగడ్డ శ్రీనివాస్, నాగాయలంక
సాగరాన్ని నమ్ముకున్న మా జీవనశైలి విభిన్నంగా ఉంటుంది. వేకువ జామున 2 గంటలకే సిద్ధం చేసుకున్న వలలను భుజాలపై వేసుకుని సంప్రదాయ బోట్లు ద్వారా సముద్రంలోకి వెళ్తాం. దాదాపు 5 కి.మీ. సముద్రంలోకి వెళ్లి వలలు వేసి మత్స్య సంపదను సేకరించి ఉదయం 8 గంటలకు తీరానికి చేరుకొంటాం. మెకనైజ్డ్ బోట్లు ఉన్న మత్స్యకారులు మాత్రం సముద్రంలో వెళ్లి వారం.. పది రోజుల పాటు అక్కడే రేయంబగళ్లు ఉండి మత్స్య సంçపదను సేకరించి తీరానికి వస్తారు. ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం మా కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోంది. గతంలో మాదిరిగా ఆర్ధిక ఇబ్బందులు ఇప్పుడైతే లేవు.. పిల్లా పాపలతో ఈ 61 రోజులు సంతోషంగా గడిపేమని శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తం చేశారు.

(2) మోకా నాగేంద్రుడు, గిలకలదిండి.మచిలీపట్నం
పది నెలల పాటు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకుంటాం. చేపల వేట నిషేధకాలంలో పగలంతా మేము వలలను సరి చేసుకుని మళ్లీ జూన్ 15 వ తేదీ తర్వాత చేపలవేటకు తిరిగి సన్నద్ధమవుతున్నాం. ఇదే మా నిత్య జీవితం కుటుంబ సభ్యులతో గడిపేది చాలా తక్కువ సమయం. ఇలా ఏడాదిలో పది నెలలు సముద్రంలోనే మా జీవితం గడిచిపోతుంది. గతంలో కుటుంబపోషణ దుర్భరంగా గడిచేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న ఆర్ధిక సహాయం కారణంగా చేపల వేట నిషేధ సమయంలో పస్తులు లేకుండా కుటుంబం అంత తృప్తిగా భోజనం చేశాం. మా గురించి ఆలోచించి మాకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మా అందరి తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు నాగేంద్రుడు చెప్పాడు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *