విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Niua, unido వారి సహకారంతో DBRC ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన 35 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల సామాజిక భద్రత గురించి వివరంగా నిపుణులు తెలియజేశారు. కార్మికులకు రోజువారీగా ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.బాబు శ్రీనివాసన్ హాజరై శిక్షణ కార్యక్రమం కార్మికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం ప్పే కిట్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో DBRC స్టేట్ team అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్, యశోద, ఉమామహేశ్వరవు, రమాదేవి, వైసిఎన్ మూర్తి, దేవా లక్ష్మి మరియు నగరపాలక సంస్థ కార్మికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News