Breaking News

అనుమతి లేకుండా విక్రయాలు జరిపితే కేసులు నమోదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేపల మార్కెట్, మాంసం, చికెన్ షాప్ లలో తూకం రాళ్లు, ఎలక్ట్రానిక్ తూకం మేషిన్ లు తూనికలు మరియు కొలతల శాఖ అనుమతి లేకుండా విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి. కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలకు చెందిన అధికారులు ఆదివారం తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు ఆధ్వర్యంలో నగరంలోని గవర్నర్ పేట బెసెంట్ రోడ్డులో చేపలు,మటన్ మరియు చికెన్ మార్కెట్, మోడరన్ చేపల మార్కెట్, పాయకాపురం ఏరియా లోని పలు దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ను పరిశీలించారు.దుకాణాల్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల పని తీరును వినియోగదారులతో మాట్లాడి కొనుగోలు చేసిన సరుకు బరువుకు సంబంధించి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టి. కనకరాజు మాట్లాడుతూ తూనికలు కొలతల శాఖ అనుమతి లేకుండా తూనిక మేషిన్లు వినియోగిస్తే దుకాణ నిర్వాహకులపై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *