భూముల రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నామని, జూలై మొదటి వారం లోగా పరిటాల గ్రామాన్ని భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన గ్రామంగా సిద్దం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు వివరించారు.
జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భూముల రీసర్వే ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో గురువారం సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, కార్యదర్శి బాబు ఏ, సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కమీషనర్‌ సిద్ధార్థ జైన్‌ ఆయన ప్రధాన కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో భూముల రీసర్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. 16 గ్రామాలు భూ సర్వే పూర్తి చేయవల్సిఉండగా వాటిలో 10 గ్రామాలను నిర్థేశించిన సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో రీ సర్వేకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని అన్‌లైన్‌ డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని, జూలై మొదటి వారంలో నోటిఫీకేషన్‌ జారీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎ కొండూరు మండలంలోని వామకుంట్ల, మారేపల్లి, గంపలగూడెం మండలం చిన్నవరం గ్రామాలలో గ్రౌండ్‌ వాలిడేషన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. విస్సన్నపేట మండలం చెండ్రుపట్ల, గంపలగూడెం మండలం రాజవరం గ్రామాలలో డ్రాప్టు ల్యాండ్‌ రిజిస్ట్రర్‌ ఎంట్రీ స్థాయిలో ఉన్నాయన్నారు. గంపలగూడెం మండలం వినగడప, రెడ్డిగూడెం మండలం నరుకుల్లపాడు, చందర్లపాడు మండలంలోని చింతలపాడు గ్రామాలలో సర్వే డేటా నాణ్యత పరిశీలన (క్యూసీ) స్థాయిలో ఉన్నాయన్నారు. గంపలగుడెం మండలం కనుమూరు, తిరువూరు మండలం చింతలపాడు గ్రామాలలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. తిరువూరు మండలం ఆంజనేయపురం, వత్సవాయి మండలం చిట్టేల, తిరువూరు మండలం ముస్తిగుంట్ల గ్రామాలు ఎల్‌పియం జనరేషన్‌ దశలో ఉన్నాయన్నారు. గంపలగూడెం మండలం అనుముల్లంక, గంపలగూడెం గ్రామాలు డేటా ఎంట్రీ స్థాయిలో ఉన్నాయని నిర్థేశించిన గడువులోగా జిల్లాలో భూ సర్వే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికాడ్స్‌ ఆఫీసర్‌ కె. సూర్యరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *