విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామిలో కూలీలకు రికార్డు స్థాయిలో పని కల్పిస్తున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్థేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డిల్లీరావు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించారు.
జిల్లాలో ఉపాధి హామి పథకంలో కూలీలకు పనికల్పించడం, స్వచ్చ సంకల్పం, ప్రభుత్వ భవన నిర్మాణాలైన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల ప్రస్తుత ప్రగతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం పిఆర్ అండ్ ఆర్‌డి ప్రన్సిపల్ సెక్రటరి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ కమిషనర్ కోన శశిధర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామి పథకం కింద 30 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్థేశించడం జరిగిందని, ఇప్పటివరకు లక్ష్యాలను మించి జిల్లాలో 47.90 లక్షల పని దినాలను రికార్డు స్థాయిలో కల్పించామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నామన్నారు. ఉపాధిహామి పథకంలో చేపట్టి జిల్లాకు మంజూరైన 268 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలలో ఇప్పటికే 130 భవనాలు పూర్తి అయ్యాయని, మరో 41 భవనాలు బిలో బెస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని, వీటితో పాటు వివిధ దశలో ఉన్న వాటిని, వేగవంతం చేయడంతో పాటు ఇంకనూ ప్రారంభం కాని వాటిని త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు మంజూరైన 260 రైతు భరోసా కేంద్రాలలో 68కు పైగా భవననిర్మాణాలు పూర్తి అయ్యాయని, 111 భవనాలు బిలో బెస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని, మిగిలిన వివిధ స్థాయిలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు మంజూరైన 239 వైఎస్సార్ క్లినిక్‌లలో 39 పూర్తి అయ్యాయని 124 బిలో బెస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని మిగిలినవి, వివిధ స్థాయిలో ఉన్న క్లినిక్‌ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమ్మెంట్‌ను సరఫరా చేస్తున్న కంపెనీలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు స్పెషల్ సిఎస్‌కు వివరించారు. క్లిన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. డోర్‌టూడోర్ తడిపొడి చెత్త సేకరణ, రవాణా, ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించి వర్మి కంపోస్ట్ తయారు చేసి రైతులకు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 288 గ్రామ పంచాయతీలలో 255 గ్రామ సచివాలయ పరిధిలో 176 పైగా సచివాలయలలో ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 285 కమ్యునిటీ శానిటరీ టాయిలెట్లు మంజూరయ్యాయని వీటిలో ఇప్పటికే 60కి పైగా నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. విగిలిన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరికి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, జడ్పిసిఇవో పిఎస్ సూర్యప్రకాష్‌రావు, డ్వామా పిడి జె. సునీత, డిపివో కెపి చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎన్‌వివి సత్యనారాయణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫిసర్ పివి రమణరావు, ఉన్నారు.
Prajavartha Online Telugu News