రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు లకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు, ఆర్డీవో లు అమలాపురం వసంత రాయుడు రామచంద్రపురం పి సింధు సుబ్రహ్మణ్యం తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
Prajavartha Online Telugu News