పేదప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించి వారి మన్ననలు పొందాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి పేదప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించి వారి మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, కన్వీనర్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌లు బుధవారం నగరంలలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సభ్యులు, అన్ని విభాగాల అధిపతులతో పుష్కర్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమ ఈ`ఆసుపత్రిగా ఎంపిక కావడం పట్ల వైద్యులు, హెచ్‌వోడిలు, నర్సింగ్‌ సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలటీ సేవలు అందుబాటులోకి రావడంతో అన్ని ఆసుప్రతులలో 60 వేలకు పైగా అవుట్‌పేషంట్‌, 5 వేల మంది ఇన్‌పేషంట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి నెల 60 వేల మంది రోగులకు వైద్యసేవలందించడం పట్ల వైద్యులు, సిబ్బందిని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచి కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా వైద్యసేవలందించి ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహలను తొలగించాలని కలెక్టర్‌ కోరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించి సేవలను మరింత మెరుగు పరుద్దామన్నారు.ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని మందులు లేవనే ఫిర్యాదులు రాకూడదన్నారు. సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ ద్వారా సరఫరా చేస్తున్న మందులను వినియోగించాలని కోరారు. మందులు కొరత లేకుండా జనరల్‌ బడ్జెట్‌ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు మహప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయని వీటిలో ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రాత్రి అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మరో రెండు వాహనాలు మచిలీపట్నం ఏలూరు నుండి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కోట్లదిరూపాయలను కేటాయిస్తోందన్నారు. నిధులు కేటాయిస్తున్నప్పటికి వైద్యసేవలు అందడంలేదని, ఆసుపత్రిలో మందులు లేవని ఫిర్యాదులు రోగులవద్దనుండి రాకూడదన్నారు. నెల వారిగా రోగులకు ఖర్చు అయ్యే మందులను అంచనా వేసుకోవాన్నారు. సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రస్తుత ఆసుపత్రిలో 1400 వరకు పడకలు అందుబాటులో ఉన్నందున బడ్జెట్‌ పెంచేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో నిరుపేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ కోరారు.
అభివృద్ధి కమిటీ సమావేశంలో సూపర్‌స్పెషాలిటీ గైనిక్‌, కార్డియాలజీ విభాగాలకు అవసరమైన డ్రగ్‌స్టోరేజ్‌ క్యాబినేట్‌, బ్లెడ్‌బ్యాంక్‌ స్టోరేజ్‌ అవసరమైన అదనపు రిప్రజిరేటర్‌ కొనుగోలుకు, ఫ్రీజర్‌ బాక్సు కొనుగోలు పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం ఈ`ఆసుపత్రికి హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ ఏర్పాటు నర్సింగ్‌ సూల్క్‌లో అవసరమైన మౌలిక వసతుల సదుపాయాలకు బడ్జెట్‌ కేటాయింపులను అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి అవసర మేరకు అనుమతులను మంజూరు చేశారు.
ఈ సమావేశంలో ఆసుపత్రి అడిషనల్‌ డైరెక్టర్‌ మరియు సూపరిండెంటెంట్‌ డా.వి సౌభాగ్యలక్ష్మి, డియంహెచ్‌వో డా.యం సుహసిని, సిద్ద్థాం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విఠల్‌రావు, డిసిహెచ్‌ఎస్‌ లక్ష్మికుమారి, అభివృద్ధి కమిటీ సభ్యులు, హెచ్‌వోడిలు, నర్సింగ్‌ స్టాప్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *