గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలందించండి…

-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ అన్నారు. నగరంలోని నార్త్‌ మండల్‌ రాజారాజేశ్వరి పేట 4వ వార్డు సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వార్డు సచివాలయ పరిధిలో ప్రజలనుండి వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియపరిచి ఆయా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను సకాలంలో లబ్దిదారులకు అంధించే విధంగా సిబ్బంది మెరుగైన సేవలందించలన్నారు. సచివాలయ పరిధిలోని గృహానిర్మాణపథకం, ఓటిఎస్‌, పెన్షన్‌, నిత్యవసర వస్తుల సరఫరా పారిశుద్ద్య కార్యక్రమాల పై దృష్టి పెట్టాలన్నారు. తడి,పొడి చెత్తను వేరువేరుగా పారిశుద్ద్య కార్మికులకు అందించే విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే సమస్యలను మరల తిరిగి రాకుండా సంబందిత అధికారులతో శాశ్వత పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక ఉద్యోగుల మూమ్మెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ , ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ప్రతి రోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించి ప్రజల మన్నలను పొందాలన్నారు. ఇప్పటివరకు సచివాలయాలనికి వచ్చిన సర్వీసులు, పరిష్కరించిన వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో లబ్దిదారుల జాబితాను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. సచివాలయాలకు సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *