-కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనబడి నాడు-నేడు పనుల్లో 40 శాతం నిధులు వినియోగించే విధంగా లక్ష్యంతో పనులు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులకు ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు పథకం, జగనన్న గృహా నిర్మాణ పథకం, మనబడి నాడు -నేడు పనుల ప్రగతిపై బుధవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌లో హాల్ నుండి జిల్లాలోని మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, రెవెన్యూ అధికారులు, స్పెషల్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విద్యా శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనబడి నాడు-నేడు పనులలో భాగంగా ఆయా పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మనబడి నాడు -నేడు రెండవ దశలో 465 పాఠశాలలు మంజూరు కాగా 307 పాఠశాలలకు నిధులు మంజూరు అయ్యాన్నారు. వారంతానికి 40 శాతం నిధులు వినియోగించేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు, ఇంజనీర్లను ఆదేశించారు. ఇసుక, సిమెంట్, ఐరన్, కంకర వంటి సరఫరా విషయంలో సమస్య లేకుండా రెండు రోజులలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చురుగ్గా పనిచేయాలని జరుగుతున్న పనులపై యంఇవోలు పూర్తి అవగాహన కలిగివుండాలని ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణ పథకంలో 75.926 రిజిస్ట్రషన్ కాగా 3,535 నిర్మాణ పనులు పూర్తి అయ్యాయన్నారు. బిలో బెసిమెంట్ లెవల్‌లో 40,463 బెసిమెంట్ లెవల్‌లో 9,446 ఉన్నాయన్నారు. ఇంకను ప్రారంభం కాని 11,413 గృహాలను వెంటనే ప్రారంభింపచేయాలన్నారు.
జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్) పెండిరగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయాలని జిల్లాలో 25,282 రిజిస్ట్రేషన్ కాగా 24,783 అన్‌లైన్ చేయడం జరిగిందన్నారు. డ్వాకుమెంటేషన్, పోటోలు తప్పని సరిగా ఉండాలన్నారు. వార్డు గ్రామ సచివాలయల ద్వారా పనులు వేగవంతం చేయాలని విఆర్‌వోలు, మహిళ పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫెర్ అసిస్టెంట్లు గ్రామ వార్డు సచివాలయ కంట్రోల్‌లో ఉండాలన్నారు. కొత్తగా వస్తున్న డ్వాకుమెంట్ యాప్‌లపై యంపిడివోలు, యంఇవోలు అవగాహన కలిగి ఉండాలన్నారు. డిజిటల్‌సైన్ పెండిరగ్‌లో ఉన్న ప్రాంతాలలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
వీడియోకాన్పరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్‌కుమార్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, హౌసింగ్ పిడి శ్రీదేవి, డిఇవో సివి రేణుక, ఉన్నారు.
Prajavartha Online Telugu News