విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుపూర్ణిమ సందర్భంగా ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరంలో బుధవారం అత్యంత వైభవముగా బాబా వారికి గురుపూర్ణిమ వేడుకలు జరుపబడినది. ఇందులో భాగంగా తెల్లవారుఝామున 4 గంటలకు కాకడ హారతి, తదుపరి గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, సహస్ర కలశ పంచామృత స్నపన జరిగింది. స్వామి వారికి ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తులు ఈ రోజు ఉదయం అంతా కూడా సుమారు 15000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మందిరములో ప్రస్తుత కార్యదర్శి కుంచనపల్లి రవి శంకర్ దంపతులచే అందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అత్యంత వైభవోపేతంగా మేళతాళములతోటి పల్లకి ఉత్సవం నిర్వహించబడినది. ఈ విశేషమైన రోజున రోజు మొత్తం మీద సుమారు 25,000 మంది భక్తులు బాబా వారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News