ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత మూడేళ్ళుగా సచివాలయం,వాలంటీర్లు వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు అన్నారు. గడపగడపకు ౼ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు 16వ డివిజన్ 75వ సచివాలయ పరిధిలోని దాపోలీస్ కాలనీ వీధులలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్ళలో వైస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారని తెలిపారు.అతి తక్కువ సమయంలో ప్రజల మన్ననలు పొందిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు వింటూ మూడేళ్ళ పరిపాలనలో ఒక్కో ఇంటికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరించారు. నవరత్నాలలో భాగంగా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా జగనన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేశామని,మరో 30 – 40 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగేలా తామంతా కృషి చేస్తామన్నారు.రాష్ట్రంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.కరోన కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదని, గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో పచ్చ చొక్కా వాళ్లకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందజేసే వాళ్లని, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు.స్థానిక ప్రజలు ఇండ్ల పట్టాలు,చెత్తపన్ను గురించి స్థానిక ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలు అధికారులతో మాట్లాడి వీలు అయినంత త్వరలో పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్ వైస్సార్సీపీ నాయకులు వేముల కొండ,మద్దాల శివ శంకర్,బద్రి ప్రకాష్,విజయ్ మోహన్,సూరిబాబు,జానకిరామ్,గుమ్మడి విజయ్ కుమార్,దుర్గా ప్రసాద్,బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *