విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇ- క్రాప్ బుకింగ్‌పై రైతులు, అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి నూరు శాతం నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్యకు వివరించారు. ఖరిఫ్ -2022 సీజన్లో ఇ-క్రాప్ బుకింగ్ జాయింట్ ఆజ్మోయిషి పై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, సిసిఎల్‌ఏ కార్యదర్శి బాబు ఏలు ప్రధాన కార్యాలయాల నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 261 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయని ఈ కేంద్రాలలో 154 మంది వీలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీలు, 64 మంది వీలేజ్ హర్టికల్చర్ సెక్రటరీలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇ-క్రాప్ బుకింగ్‌పై రెవెన్యూ, సర్వే వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించి ప్రతీ రైతుకు చెందిన సెంటు భూమిని కూడా ఇ-క్రాప్ బుకింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనివలన రైతులకు ప్రభుత్వం ద్వారా అందే పంట నష్టపరిహారం, విత్తనాలు, ఎరువుల సబ్బిడీ వ్వవసాయ బీమా, ప్రభుత్వ కల్పించే కనీస మద్దతు ధర వంటి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని రైతులను చైతన్యవంతులను చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. మండల స్థాయిలో తహాశీల్థార్లు, వ్యవసాయ శాఖ అధికారులకు ఇ-క్రాప్ బుకింగ్‌పై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌లో వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభారతి, ఉద్యానశాఖ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News